ఫతేనగర్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ఈగిల్ ఫోర్స్ దాడులు
హైదరాబాద్ ఫతేనగర్‌లో ఈగిల్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ఆకాష్‌ను అరెస్టు చేసిన అధికారులు, అతడి ద్వారా 29 మంది గంజాయి వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. వారికి నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. వారి వద్ద నుంచి 17.8 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ఆకస్మిక దాడులు కొనసాగుతాయని ఈగిల్ ఫోర్స్ వెల్లడించింది.











