Home National_news వెంకీ అట్లూరికి నేషనల్ అవార్డ్ ‘లక్కీ భాస్కర్’కు జాతీయ గౌరవం

వెంకీ అట్లూరికి నేషనల్ అవార్డ్ ‘లక్కీ భాస్కర్’కు జాతీయ గౌరవం

7



దర్శకుడు వెంకీ అట్లూరి మరో అరుదైన ఘనత సాధించారు. ఆయన తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు లభించింది. సినిమాలో కథను ఆసక్తికరంగా నడిపించడం, భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించడం, ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో వెంకీ అట్లూరి ప్రశంసలు అందుకున్నారు. ఈ అవార్డుతో ఆయన రచనా ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ‘లక్కీ భాస్కర్’ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.