Home AP పులివెందుల ప్రజలతో మమేకం సమస్యలు వింటూ కార్యకర్తలకు భరోసా

పులివెందుల ప్రజలతో మమేకం సమస్యలు వింటూ కార్యకర్తలకు భరోసా

జగన్‌కు రాఖీలు.. ఆత్మీయ పలకరింపులు.
ప్రజాదర్బార్‌లో సమస్యలు విన్న మాజీ సీఎం.

పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, యువతులు జగన్‌ను కలిసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారితో ఆత్మీయంగా మాట్లాడిన జగన్‌.. సోదరుడిలా ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

పార్టీ అండగా ఉంటుందని భరోసా

ప్రజాదర్బార్‌కు వచ్చిన పలువురు తమ వ్యక్తిగత సమస్యలు, స్థానిక ఇబ్బందులను జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారి విజ్ఞప్తులను ఓపికగా విన్న ఆయన.. సమస్యలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్‌ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు జగన్‌ను కలిశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రజాదర్బార్‌ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలు రాఖీలు కట్టి జగన్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేయడం పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

3న కర్నూలుకు జగన్

ఇదిలా ఉండగా, జగన్‌ సెప్టెంబర్‌ 3న కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కర్నూలు చేరుకుని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి. మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం కర్నూలు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

#YSJagan #JaganMohanReddy #Pulivendula #JaganPulivendulaVisit #PrajaDarbar #YSRCP #YSRCPNews #PulivendulaPolitics #Jagan #AndhraPradeshPolitics #JaganRakshabandhan #Kurnool #JaganKurnoolVisit