Home AP ఉత్తరాంధ్రకు గోదావరి జలధార పోలవరం ఎడమ కాలువకు ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలధార పోలవరం ఎడమ కాలువకు ప్రవాహం

నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్‌ ఆన్‌ చేసి సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటుకుంటూ నీరు ముందుకు సాగనుంది. తూర్పు కనుమలు, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశారు.

లక్షల ఎకరాలకు సాగునీరు

కాలువ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నాలుగు జిల్లాల్లో 2,87,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ప్రస్తుతం విడుదలవుతున్న గోదావరి జలాలతో అనకాపల్లి జిల్లాలోనే 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. ఏలేరు నది కింద సైఫన్, పంపా నదిపై అక్విడెక్ట్‌ నిర్మించారు. పంపా అక్విడెక్ట్‌కు 30 మీటర్ల లోతులో 312 పైల్స్‌తో పునాదులు వేశారు. తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా ఆరు వెంట్లతో 447 మీటర్ల పొడవైన అక్విడెక్ట్‌ నిర్మించారు. తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.

 

#Polavaram #PolavaramLeftCanal #GodavariWaters #NorthAndhra #ChandrababuNaidu #AndhraPradesh #GodavariRiver #Irrigation #PolavaramProject #Anakapalli #WaterProjects #APDevelopment