కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాలవ సమీపంలోని పాపాగ్ని నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గుంతలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు మృతి చెందారు. పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డిగారిపల్లెకు చెందిన రాజవర్ధన్ రెడ్డి (16), జయంతి రెడ్డి (18) బంధువుల ఇంటికి వచ్చి సరదాగా నదికి వెళ్లగా ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. అక్రమ ఇసుక తవ్వకాలే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు కోరుతున్నారు.
#Kadapa #Chakrayapeta #PapagniRiver #SandMining #IllegalSandMining #RiverTragedy #DrowningIncident #KadapaNews #AndhraPradesh #AccidentNews #BrothersDeath #Kumarakalava #Pendlimarri #RescueOperation #FireServices #RiverAccident #PublicSafety #MiningViolation #TragicIncident #VillageNews #BreakingNews #LatestNews #AndhraNews #YouthDeath #FamilyTragedy #EnvironmentalIssues #SandMafia #PoliceInvestigation #LocalNews #JusticeForVictims











