ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ప్రపంచ సినీ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ఇప్పుడు బిజినెస్ పరంగా మరో రికార్డుకు చేరువైంది. విదేశీ థియేట్రికల్ హక్కుల విక్రయానికి చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదట నిర్ణయించిన ఓవర్సీస్ హక్కుల ధర చాలా ఎక్కువగా ఉండటంతో సాధారణ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గినట్లు సమాచారం. చివరకు కొద్దిమంది మాత్రమే పోటీలో నిలవగా, దుబాయ్‌కు చెందిన ఫార్స్ ఫిల్మ్స్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి, ప్రభాస్ చిత్రాలను విదేశాల్లో విజయవంతంగా విడుదల చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా, ప్రకాశ్ రాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రామాయణ అంశాలను టైమ్ ట్రావెల్, ఫాంటసీతో మేళవించిన గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల చూపు నిలిచింది.
#SSRajamouli #MaheshBabu #VaranasiMovie #RajamouliFilm #Tollywood #OverseasRights #GlobalCinema #PriyankaChopra #PrakashRaj #PrithvirajSukumaran #AdventureDrama #FantasyFilm #TimeTravel #MovieBusiness #TeluguCinema #EntertainmentNews #BreakingNews #LatestNews #MovieUpdates #TeluguNews











