బద్వేల్ పురపాలక సంఘంలో రూ.3.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) సెంటర్‌ను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ (ఎస్‌ఏసీ) చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సందర్శించారు. వ్యర్థాల వర్గీకరణ, పునర్వినియోగ ప్రక్రియ, ఆధునిక యంత్రాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ విధానాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రమైన, సుస్థిరమైన బద్వేల్ నిర్మాణంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రమాణాలకు అనుగుణంగా కేంద్రాన్ని నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, డీసీసీబీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.











