Home AP ప్రొక్లెయిన్ నడిపి పనులను ప్రారంభించిన బాలకృష్ణ వాట్సాప్ మెసేజ్ చేస్తే.. సమస్య పరిష్కరిస్తానని భరోసా

ప్రొక్లెయిన్ నడిపి పనులను ప్రారంభించిన బాలకృష్ణ వాట్సాప్ మెసేజ్ చేస్తే.. సమస్య పరిష్కరిస్తానని భరోసా

14


హిందూపురం ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా వాట్సాప్‌లో తనను సంప్రదించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. హిందూపురం పర్యటనలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి రూ.790 కోట్ల వ్యయంతో చేపడుతున్న మడకశిర బ్రాంచ్ కాలువ విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ప్రొక్లెయిన్ నడిపి పనులను ప్రారంభించారు. చౌడేశ్వరి కాలనీలో పార్కు, ప్రభుత్వాసుపత్రిలో రక్తనిధి కేంద్రం, ఇండోర్ స్టేడియం, వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడి ఆకట్టుకున్నారు. హిందూపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బాలకృష్ణ స్పష్టం చేశారు.