రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. జడ శ్రావణ్, ప్రశ్న రావణ్ కార్యకలాపాల వెనుక వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ శంఖారావం సభలో అసలు అంశాలను పక్కనబెట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందన్నారు. రావణ్, జడ శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజ్ పాత్రలతో పాటు వారి ఆర్థిక లావాదేవీలు, విదేశీ నిధుల కోణంలో కూడా సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. సనాతన ధర్మాన్ని అవమానించే ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసిన తుమ్మల రామస్వామి బాబు, రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.











