ఎన్నికలకు ముందుగానే ట్రంప్ బాజా
ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే ఎత్తుగడ
చెప్పుచేతల్లోకి వ్యవస్థను తీసుకునే క్రీడ
మాస్టర్ స్ట్రాటజీతో అగ్రరాజ్యంలో కొత్త హోరు
ఎన్నికల వ్యూహాలతో అంటుకుంటున్న పోరు
ప్రజాస్వామ్యానికి మార్గదర్శకంగా చెప్పుకునే అమెరికాలో ఇప్పుడు ఎన్నికల వ్యవస్థే రాజకీయ పోరాటానికి కేంద్రబిందువుగా మారుతోంది. ఎన్నికలు జరగకముందే వాటి నిర్వహణ విధానం, ఓటర్ల నమోదు, ఎన్నికల సంస్థల నిర్మాణం, ఓటింగ్ నిబంధనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటుండటం తీవ్ర చర్చకు దారితీసింది. ఓటర్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల కమిషన్ నాయకత్వంలో మార్పులు వరకు ప్రతి చర్య వెనుక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020 ఎన్నికల అనుభవం తర్వాత ఫలితాలను మార్చే ప్రయత్నం కాకుండా, ఈసారి ఎన్నికలకు ముందే వ్యవస్థను తనకు అనుకూలంగా మలచే ఎత్తుగడ అమలవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల భద్రత పేరుతో సాగుతున్న ఈ చర్యలు ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను ప్రభావితం చేస్తాయా? లేక ఎన్నికల విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీశాయి.
Home Inter National News ఇండియాలో కాదు.. అమెరికాలో సర్ ఎన్నికల వ్యవస్థపై డొనాల్డ్ నజర్ అమెరికా ఎన్నికల వ్యవస్థపై...











