పాముకాటుకు కొత్త ఏర్పాట్లు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులకు శుభవార్త. పాము కాటు బాధితులకు సకాలంలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం 108 అంబులెన్సుల్లో యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచే చర్యలు చేపట్టింది. దీంతో ఆసుపత్రికి చేరుకునేలోపే అత్యవసర చికిత్స ప్రారంభించే అవకాశం కలుగుతుంది.
ప్రాణాలు కాపాడే నిర్ణయం
తాచు, రక్తపింజరి, కట్లపాము వంటి విషసర్పాల కాటుకు తొలి గంట అత్యంత కీలకం. మారుమూల గ్రామాల్లో ఆసుపత్రులకు ఆలస్యంగా చేరడం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో 108 అంబులెన్సుల్లో అవసరమైన ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచే ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగపడనుంది.











