సంస్కృతిపై కొత్త రాజకీయ పోరు?
పండుగపై మొదలైన కొత్త చర్చ.
మమత బెనర్జీపై బీజేపీ మాస్టర్ స్ట్రోక్ .
బెంగాల్‌లో దుర్గాపూజ మళ్లీ రాజకీయ కేంద్రంగా మారుతోంది. దేవి పూజ చుట్టూ కాదు.. బెంగాల్ సంస్కృతికి అర్థం చెప్పే హక్కు ఎవరిదన్న దానిపైనే కొత్త పోరు మొదలైంది. ఇన్నాళ్లు దుర్గాపూజను బెంగాలీ అస్మిత, కళ, ఆహారం, సామాజిక వైవిధ్యానికి ప్రతీకగా మమతా బెనర్జీ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అదే పండుగను సనాతని హిందూ గుర్తింపు, సంప్రదాయ గర్వం చుట్టూ మలచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న చర్చ మొదలైంది. పూజా పందిళ్లలో థీమ్‌లు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలపై మొదలైన వివాదం ఈ రాజకీయ లెక్కలకు మరింత పదును పెడుతోంది. అసలు టార్గెట్ దుర్గాపూజ కాదు.. ‘బెంగాలీ సంస్కృతి కాపలాదారు’గా మమతకు ఉన్న ఇమేజ్‌నేనా? అన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది. మమతా మోడల్‌కు భిన్నంగా బీజేపీ సనాతని కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే.. బెంగాల్ రాజకీయాల్లో కొత్త సాంస్కృతిక సమీకరణం మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ఇది పందిళ్ల పోరు కాదు.. బెంగాల్ ఆత్మను ఎవరు నిర్వచిస్తారన్న అసలైన రాజకీయ పోరు.
#DurgaPuja #BengalPolitics #WestBengalPolitics #MamataBanerjee #BJP #BengaliCulture #SanataniHindu #DurgaPujaPolitics #BengaliAsmita #TMC #BJPWestBengal #CulturalPolitics











