లక్సెంబర్గ్ వెంచర్ డేస్ ఇన్విటేషన్ .
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. యూరప్‌లో స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్, పెట్టుబడుల రంగానికి కీలక వేదికగా నిలిచే లక్సెంబర్గ్ వెంచర్ డేస్–2026లో కీలకోపన్యాసం చేయాలని నిర్వాహకులు ఆయనను ఆహ్వానించారు. లక్సెంబర్గ్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని లక్స్ఇన్నోవేషన్, క్సెంబర్గ్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్
నిర్వహిస్తున్నాయి. ఆసియా, యూరప్ దేశాల్లో పెట్టుబడుల విధానాలు, పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే ధోరణి, స్టార్టప్ వ్యవస్థాపకుల అంచనాలు, పెట్టుబడి అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యంపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సెషన్లో కేటీఆర్ మాట్లాడనున్నారు. భారత్‌ను అంతర్జాతీయ పెట్టుబడులు, ఆవిష్కరణల వ్యవస్థతో అనుసంధానించడంలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
వెంచర్ క్యాపిటల్ దిగ్గజాలతో సమావేశాలకు అవకాశం
ఈ సదస్సుకు యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విధాన నిర్ణేతలు హాజరుకానున్నారు. గత ఏడాది జరిగిన కార్యక్రమానికి 28 దేశాల నుంచి 3,400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 300 మందికి పైగా పెట్టుబడిదారులు, 110 వెంచర్ క్యాపిటల్ ఫండ్ల ప్రతినిధులు ఉన్నారు. యూరప్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, నాటో ఇన్నోవేషన్ ఫండ్ వంటి సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది యూరప్ బిజినెస్ యాంగిల్ నెట్వర్క్ వార్షిక సమావేశంతో పాటు డిఫెన్స్ వెంటర్ డే వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేదిక ద్వారా కేటీఆర్‌కు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్యామిలీ ఆఫీసులు, వెంచర్ క్యాపిటలిస్టులతో నేరుగా చర్చించే అవకాశం లభించనుంది. స్టార్టప్‌లు, సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణలపై కేటీఆర్‌కు అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపుల్లో లక్సెంబర్గ్ వెంచర్ డేస్ ఆహ్వానం మరో కీలక పరిణామంగా నిలిచింది.
#KTR #KTRamaRao #LuxembourgVentureDays2026 #BRS #VentureCapital #StartupInvestments #GlobalInvestments #Luxembourg #EuropeanStartups #Innovation #InternationalRecognition #TelanganaPolitics











