Home Telangana చిన్నారెడ్డి ఎవరు? నాటి హీరో నేడు విలన్ ఎలా అయ్యారు?

చిన్నారెడ్డి ఎవరు? నాటి హీరో నేడు విలన్ ఎలా అయ్యారు?

మాజీ మంత్రిని అందేకే పక్కనపెట్టారా?
తెలంగాణకై తొలినాటి పోరాట యోధుడు .

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌లోనే తొలి గొంతు వినిపించిన నేతల్లో జిల్లెల చిన్నారెడ్డి ఒకరని ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేసి 42 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి మెమోరాండం సమర్పించారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి తాను పార్టీలోనే కొనసాగుతున్నానని, ఎన్నో ఏళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత సాధించిన స్థాయిని ఒక్క నిర్ణయంతో కోల్పోయే పరిస్థితి వచ్చిందని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదవి ఉన్నా లేకపోయినా తన గౌరవం తనకు ఉంటుందని స్పష్టం చేశారు.

పదవి పోయింది.. పోరాటం మిగిలింది

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత సొంతూరులో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. తనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలవలేదని, తాను కూడా కలిసేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. తనకు ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో పదవికి నిర్దిష్ట కాలపరిమితి లేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని మాత్రమే ఉందని వివరించారు. తన కుమారుడికి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఎప్పుడూ కోరలేదన్నారు. తాజా పరిణామాలకు ఎంపీ మల్లు రవి కారణమని ఆరోపించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆలోచించిన తర్వాత నిర్ణయిస్తానన్నారు. కాంగ్రెస్‌లో వీ.హనుమంతరావు తర్వాత తానే సీనియర్‌ నేతనని చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలను పక్కనపెట్టి అవకాశవాద రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు కూడా ఈ పరిణామంతో మళ్లీ తెరపైకి వచ్చాయి.

 

#JillellaChinnaReddy #ChinnaReddy #TelanganaMovement #TelanganaCongress #CongressLeader #RevanthReddy #MalluRavi #TelanganaStatehood #TelanganaPolitics #CongressPolitics #PlanningCommission #TelanganaLeaders