Home Telangana బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ వ్యూహం సెప్టెంబర్‌ 6న ఎర్రవల్లిలో భేటీ

బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ వ్యూహం సెప్టెంబర్‌ 6న ఎర్రవల్లిలో భేటీ

కేసీఆర్‌ అధ్యక్షతన కీలక సమావేశం

సెప్టెంబర్‌ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి నిర్ణయించారు. సెప్టెంబర్‌ 6న ఎర్రవల్లి నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు లంచ్‌ అనంతరం సమావేశం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా హాజరుకావాలని కేసీఆర్‌ సూచించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను సభలో ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసే విధానంపై కేసీఆర్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు సమన్వయంతో వ్యవహరించేందుకు అవసరమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే ఎర్రవల్లిలో జరిగే కేసీఆర్‌ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

 

#KCR #BRS #BRSAssemblyStrategy #KCRMeeting #BRSMLAs #BRSMLCs #TelanganaAssembly #AssemblySessions #Erravelli #TelanganaPolitics #CongressGovernment #BRSStrategy