రామవరం గ్రామంలో సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గోదావరి, కృష్ణా డెల్టాలను సస్యశ్యామలం చేసి రైతాంగ అభ్యున్నతికి పునాది వేసిన మహనీయుడు కాటన్ అని ఎమ్మెల్యే కొనియాడారు. విదేశీయుడైనా భారత రైతుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. రామవరంలోని కాటన్ విగ్రహం శిథిలావస్థకు చేరిందని, త్వరలోనే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
#SirArthurCotton #ArthurCotton #Ramavaram #Anaparthi #NallamilliRamakrishnaReddy #NallamilliManojReddy #GodavariDelta #KrishnaDelta #Farmers #AndhraPradesh #Tribute #TDP











