కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. కరీంనగర్లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో తెలంగాణకు కొత్తగా నియమితులైన పార్టీ ఇన్ఛార్జ్లతో అమిత్ షా భేటీ అయ్యే అవకాశముంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజు పార్టీ ఆఫీస్ బేరర్లతోనూ సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ కార్యక్రమం తర్వాత హైదరాబాద్లో వరుస సమావేశాలతో అమిత్ షా పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. అయితే హైదరాబాద్లో భేటీలకు సంబంధించిన తుది షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
#AmitShah #AmitShahTelangana #TelanganaBJP #Karimnagar #Hyderabad #BJP #SunilBansal #AbhayPatil #RekhaSharma #BJPIncharge #BJPMeetings #TelanganaPolitics #AmitShahVisit #BJPOfficeBearers #TelanganaNews











