ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం, అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు క్రిమినల్ మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, వారి చీరలు లాగారని ఆరోపించారు. కేసీఆర్ ఎర్రవల్లి నివాసం వైపు వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేశారని, తాము పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే కాంగ్రెస్ నేతలు పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగారని విమర్శించారు. గజ్వేల్‌కు కాంగ్రెస్ గూండాలను, పోలీసులను పంపించారని ఆరోపిస్తూ రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి మనసులోని మాటను బయటపెట్టారని అన్నారు. కేసీఆర్ ఎందుకు చావాలని ప్రశ్నించిన కేటీఆర్.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా అని నిలదీశారు.
హామీలపై నిలదీస్తాం.. వెనక్కి తగ్గం
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిరుద్యోగులు రాహుల్‌గాంధీని అడుగుతున్నారని అన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే తమ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ అసలు టార్గెట్ కాదని.. ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం కావాలని కేటీఆర్ సూచించారు. తమపై దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి తీరును హిట్లర్‌తో పోల్చుతూ ఆయనకు కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
#KTR #RevanthReddy #BRS #TelanganaPolitics #KTRNews #RevanthReddyGovernment #CastePolitics #NoCastePolitics #BRSvsCongress #KCR #Erravalli #Gajwel #BRSProtest #BRSLeaders #PoliceAction #WomenMLAs #CongressPromises #TelanganaJobs #TwoLakhJobs #WomenScheme #BRSAssemblyStrategy #CongressGovernment #TelanganaNews











