Home Telangana పోచారం ఏం చేస్తున్నారు? నిన్న కేసీఆర్‌‌పై పొగడ్తలు నేడు రేవంత్‌తో షేక్‌హ్యాండ్!

పోచారం ఏం చేస్తున్నారు? నిన్న కేసీఆర్‌‌పై పొగడ్తలు నేడు రేవంత్‌తో షేక్‌హ్యాండ్!



పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ అడుగులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. నిన్న కేసీఆర్‌పై ప్రశంసలు.. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డితో ఆత్మీయ పలకరింపు! అసలు పోచారం లెక్కేంటి? అన్న చర్చ జోరందుకుంది. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ నాయకత్వాన్ని బలంగా సమర్థించిన పోచారం.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పరిణామాల మధ్య ప్రభుత్వ సలహాదారుగా మారారు. తాజాగా కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జరిగిన ఓ వివాహ వేడుకకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అక్కడ హెలిప్యాడ్‌ వద్ద పోచారం శ్రీనివాస్‌రెడ్డి సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. అంతటితో ఆగలేదు.. రేవంత్‌ తిరిగి వెళ్లే సమయంలో ప్రత్యేక బస్సులో ఆయనతో కలిసి హెలిప్యాడ్‌ వరకు వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు చేసిన పోచారం.. అదే ప్రభుత్వ ముఖ్యమంత్రితో ఇలా సన్నిహితంగా కనిపించడం వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేనికి దానికేనా? నిన్న ఒక మాట.. నేడు మరో అడుగు? లేక బాన్సువాడ రాజకీయాల్లో ఇదంతా కొత్త సమీకరణాలకు సంకేతమా? పోచారం ఏం చేస్తున్నారు? అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర ప్రశ్నగా మారింది.

 

#PocharamSrinivasReddy #Pocharam #KCR #RevanthReddy #TelanganaPolitics #Banswada #BanswadaPolitics #BRS #Congress #TelanganaCongress #PoliticalEquations #TelanganaNews #PocharamNews #KCRNews #RevanthReddyNews