Home Naadesam_Special ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పోటీ

ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పోటీ

ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ పోటీ చేయనుంది. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈ విషయాన్ని ప్రకటించారు. సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల ద్వారా పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగబద్ధత అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణపైనా కవిత స్పందించారు.

ప్రభుత్వంపై కవిత విమర్శలు
కాంగ్రెస్‌ ప్రభుత్వం దర్యాప్తుల పేరుతో రాజకీయ హడావుడి చేస్తోందని కవిత విమర్శించారు. ‘ఫామ్‌హౌస్‌ రాజకీయాల’ పేరుతో సంచలనం సృష్టించి, కొంతకాలానికి విషయాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటివరకు ఏం జరిగిందని ప్రశ్నించారు. తన ఆస్తులపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. తన ఆస్తులను చట్టబద్ధంగానే సంపాదించానని, అక్రమంగా ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే ఆ ఆస్తులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు అధికారిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.

 

#Khairatabad #KhairatabadBypoll #KhairatabadByElection #Kavitha #TRS #TelanganaRakshanaSena #TelanganaPolitics #TRSParty #KalvakuntlaKavitha #TelanganaElections #ElectionCommission #VoterList #PoliticalDevelopments #TelanganaNews