స్వామివారి సంపద వెనుక శతాబ్దాల చరిత్ర.
ఏడు కొండలపై అపార సంపద..
భక్తుల కానుకలతో పెరుగుతున్న వైభవం..
ఏడు కొండలపై.. బంగారు సామ్రాజ్యం!
హుండీలో కోట్ల వర్షం.. బ్యాంకుల్లో టన్నుల బంగారం.. ఆభరణాల్లో వజ్రాల మెరుపులు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా తిరుమల వైభవం రోజురోజుకూ విస్తరిస్తోంది. రాజుల కాలం నుంచి సామాన్య భక్తుల వరకు సమర్పించిన కానుకలతో శ్రీవారి ఖజానా తరతరాలుగా నిండుతూనే ఉంది. ఏటా వేల కోట్ల ఆదాయం.. వేల కోట్ల ఆస్తులు.. బంగారు కిరీటాలు, వజ్రాల హారాలు, విలువైన ఆభరణాలతో స్వామివారి సిరిసంపదలకు లెక్కే లేదు. తాజాగా చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించారు. వాటి విలువ అక్షరాలా రూ.207.6 కోట్లు! ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ అపూర్వ కానుక సమర్పణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు తిరుమలలో ఎంత బంగారం ఉంది? ఏటా శ్రీవారికి వచ్చే ఆదాయం ఎన్ని వేల కోట్లు? ఆ సంపదను ఎలా ఖర్చు చేస్తున్నారు? కృష్ణదేవరాయలు మొదలుకొని నేటి పారిశ్రామికవేత్తల వరకు బంగారు కానుకలు సమర్పించిన ప్రముఖులెవరు? శతాబ్దాలుగా సాగుతున్న ఈ బంగారు వైభవం వెనుక ఆసక్తికర చరిత్ర ఏమిటి? తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే!
#Tirumala #TirupatiBalaji #TTD #LordVenkateswara #GoldDonation #121KgGold #VardhamanJain #RadhikaJain #TirumalaTemple #TempleWealth











