ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న వేళ నగరాల జనాభా కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఆర్థిక అవకాశాలు, ఉపాధి, విద్య, వైద్యం కోసం కోట్లాది మంది నగరాల బాట పట్టడంతో మహానగరాలు మరింత విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల తాజా జాబితా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2026 అంచనాల ప్రకారం విడుదలైన నివేదికలో భారతదేశానికి చెందిన ఢిల్లీ, ముంబై ప్రపంచ అగ్ర నగరాల సరసన నిలవడం విశేషం. అగ్ర నాలుగు స్థానాల్లోనే రెండు భారత నగరాలు చోటు దక్కించుకోవడం దేశంలో వేగంగా సాగుతున్న పట్టణీకరణకు నిదర్శనంగా నిలిచింది. అదే సమయంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, రవాణా, గృహ నిర్మాణం, ప్రజా సేవలను విస్తరించడం ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారుతోంది.
ఆసియా నగరాల హవా
Home Naadesam_Special ప్రపంచ నగరాల్లో భారత్ దూసుకెళ్లింది…ఢిల్లీ రెండో స్థానం… ముంబై నాలుగో స్థానంలో
ప్రపంచ నగరాల్లో భారత్ దూసుకెళ్లింది…ఢిల్లీ రెండో స్థానం… ముంబై నాలుగో స్థానంలో
World's Most Populous Cities 2026












