Home AP గరం గరం విజయనగరం జడ్పీ పోరులో వారసుల ఎంట్రీ

గరం గరం విజయనగరం జడ్పీ పోరులో వారసుల ఎంట్రీ

విజయనగరం రాజకీయమంటేనే ఓ రకమైన వేడి.. అందులో బొత్స వారసత్వం, కిమిడి కళా వెంకట్రావు రాజకీయ నైపుణ్యం తలపడితే సీన్‌ ఇంకో లెవల్‌లో ఉండక మానదు. ఇది ఉత్తరాంధ్ర గడ్డ మీద పీఠం కోసం జరిగే మామూలు పోరు కాదు.. ఒకవైపు ఏళ్ల తరబడి జనాల్లో నడిచిన బొత్స కుటుంబం పేరు, మరోవైపు రాజకీయ ఎత్తుగడలు, అనుభవంతో ప్రత్యర్థులను ఢీకొట్టిన కిమిడి వ్యూహం. ఇప్పుడు ఆ రెండు శక్తులు తమ తర్వాతి తరాన్ని ముందుకు నడిపించే దిశగా కదులుతున్నాయన్న చర్చ జిల్లాలో గట్టిగానే వినిపిస్తోంది. బొత్స వారసత్వానికి అనూష ప్రతినిధిగా కనిపిస్తుంటే.. కిమిడి రాజకీయ నైపుణ్యానికి రామ్‌ మల్లిక్‌ నాయుడు కొత్త ముఖంగా నిలుస్తున్నారు. ఎవరి వెనక కేడర్‌ నిలుస్తుంది? ఎవరి వ్యూహం పని చేస్తుంది? ఎవరి కుటుంబ ముద్ర విజయనగరంపై మరింత గట్టిగా పడుతుంది? ఇదే ఇప్పుడు అసలు సమరం. జడ్పీ పీఠం ఒక సీటే కావొచ్చు.. కానీ దాని వెనక నడుస్తున్న రాజకీయ యుద్ధం మాత్రం 2029 దాకా ప్రభావం చూపించేంత పెద్దది.

 

#Vizianagaram #VizianagaramPolitics #ZPElections #ZillaParishad #NorthAndhra #BotsaFamily #Anusha #KimidiKalaVenkataRao #RamMallikNaidu #AndhraPradeshPolitics #LocalBodyElections #APPPolitics #PoliticalHeirs #VizianagaramZP #APPolitics