Home Telangana మీసం మెలేసిన కొండా మురళీ

మీసం మెలేసిన కొండా మురళీ

పదవులు పోయినా ఆత్మగౌరవం పోలా
సూటిగా మాట్లాడితే వేటేస్తారా?

కొండా సురేఖ బర్తరఫ్‌ నేపథ్యంలో కొండా మురళీ చేసిన తాజా ట్వీట్‌ తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. “ఇది కొత్తేమీ కాదు.. ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు” అంటూ ఆయన తనదైన శైలిలో స్పందించారు. నేడు తమపై చర్యలు జరిగితే.. రేపు మరొకరి వంతు రావచ్చని వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నా లేకపోయినా ఆత్మగౌరవం మాత్రం తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విషయానికీ వెంటనే స్పందించకపోయినా.. జరుగుతున్న ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నామని కొండా మురళీ పేర్కొన్నారు. తమపై జరుగుతున్న రాజకీయ దాడులను ఎదుర్కొనేందుకు వెనక్కి తగ్గబోమని సంకేతం ఇచ్చారు. అందరూ కలిసి తమపై రాజకీయ దాడులు చేస్తున్నా.. ధైర్యంగా నిలబడి, పట్టుదలతో ఎదుర్కొంటామని ఆయన ట్వీట్‌లో స్పష్టం చేశారు. మరోవైపు సురేఖ ప్రెస్‌మీట్‌కు బాల్కనీలో కన్పించిన మురళీ మీసం మెలేస్తూ కన్పించాడు. సురేఖ మంత్రి పదవి కోల్పోయిన కొద్దిసేపటికే మురళీ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ ట్వీట్‌ ద్వారా కొండా కుటుంబం రాజకీయంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

#KondaMurali #KondaSurekha #KondaFamily #KondaMuraliTweet #TelanganaPolitics #SurekhaDismissal #TelanganaCongress #RevanthReddy #PoliticalControversy #KondaSurekhaControversy #TelanganaPoliticalNews