ఏపీలో 52% లేటుగా వర్షపాతమన్న వైసీపీ .
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యంలో కరువు పరిస్థితులపై చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్లో చర్చకు వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులను చంద్రబాబు అంగీకరించారని వారు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం లోటు 14 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 52 శాతం లోటు నమోదైందని సీఎం వెల్లడించారు. కరువు పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాస్తామని ప్రకటించారు. ఇటీవలే జగన్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. నీటిని విడుదల చేయలేని పరిస్థితులు ఉన్నాయని కేబినెట్ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. కరువు పరిస్థితులపై కేంద్ర సాయం కోరడంతో పాటు, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం మంత్రులకు సూచించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎదురుదాడి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం ఉందని ప్రభుత్వం అంగీకరించడంతో, జగన్ చేసిన విమర్శలపై రాజకీయ చర్చ మరింత ముదిరింది.
#APDrought #AndhraPradesh #YSRCP #YSJagan #JaganMohanReddy #ChandrababuNaidu #APCabinet #RainfallDeficit #DroughtSituation #APFarmers #IrrigationWater #AgricultureAP #DroughtRelief #APPolitics #AndhraPradeshNews











