ఇండియా కూటమి వైపు అడుగులా?
రాజకీయ వైఖరిలో భారీ మార్పు.
జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ.
జగన్ గేర్ మార్చారా? కేంద్రంపై సమరం.
ఒకప్పుడు కేంద్రానికి అండగా నిలిచిన నేత.. ఇప్పుడు అదే వ్యవస్థపై సమరభేరి మోగిస్తున్నారు! పార్లమెంటులో ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు మద్దతిచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఆ నిర్ణయం తప్పిదమంటూ బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌కు మద్దతుగా గళమెత్తుతున్నారు. ఏపీలోనూ స్థానిక ఎన్నికల నామినేషన్లపై అధికార కూటమిని నిలదీస్తున్నారు. అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం ప్రకటిస్తున్నారు. ఇంతకాలం కేంద్రంతో సఖ్యతగా సాగిన జగన్ రాజకీయ ప్రయాణంలో ఈ మలుపు ఎందుకు? టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న వేళ.. వైఎస్సార్‌సీపీ అధినేత తన జాతీయ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటున్నారా? కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు. అయితే విమర్శలు చేయడం ఒక ఎత్తు.. కొత్త రాజకీయ బంధానికి అడుగులు వేయడం మరో ఎత్తు. జగన్ తాజా వ్యాఖ్యలు కేవలం ఎన్నికల వ్యవస్థపై ఆగ్రహమేనా? లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతమా? గత నిర్ణయంపై పశ్చాత్తాపం నుంచి కొత్త పోరాటం వరకు సాగుతున్న ఈ పరిణామాల వెనుక అసలు రాజకీయ లెక్కలేమిటి? జగన్ మారిన స్టాండ్.. ఏపీ రాజకీయాల్లో కొత్త సమరానికి నాందినా?
#YSJagan #YSRCP #ElectionCommission #ChiefElectionCommissioner #INDIAAlliance #AndhraPradeshPolitics #TDP #ChandrababuNaidu #ElectionReforms #IndianPolitics #PoliticalStrategy #ElectionControversy











