నోటి దురుసు… మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు

54

జనసేన ఎమ్మెల్యే నానాజీపై వైసీపీ కౌంటర్

కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో దూషించారు. జగన్ దమ్ముంటే కడప జిల్లాను వదిలిపెట్టి కాకినాడ రూరల్‌లో వచ్చి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఆయన వాడిన కొన్ని అనుచిత పదాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తోట త్రిమూర్తులు సవాల్
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గట్టి కౌంటర్ ఇచ్చారు. తను తన ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నానాజీ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీకి రావాలన్నారు. ఒకవేళ నానాజీపై తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు. తనకు కూడా తిట్టడం వచ్చునని, కానీ సంస్కారం అడ్డువస్తోందని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి పంతం నానాజీకి లేదని తోట త్రిమూర్తులు హితవు పలికారు.

 

#Janasena #PantamNanaji #YSRCP #YSJagan #ThotaTrimurthulu #AndhraPolitics #KakinadaRural #PoliticalWar #APPolitics #PoliticalChallenge #MLCThotaTrimurthulu #JanasenaMLA #YSRCounter #PoliticalControversy #AndhraPradeshNews #PoliticalDebate #KakinadaNews #ElectionChallenge #TeluguPolitics #BreakingNews