ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోక్రేజ్ ఉన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన మూవీలో నటించేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతారు. దీన్నే అదనుగా తీసుకుని కొంతమంది సరికొత్త మోసానికి తెరలేపారు. ఈ విషయం కాస్తా చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అవన్నీ ఫేక్ అంటూ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్నది. కీర్తి సురేశ్, కృతిశెట్టి కథానాయికలు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీ మొదలైంది. అంతేకాదు, ’రాయల సీమ నేపథ్యం’ అంటూ ప్రచారాన్ని కూడా అనిల్ రావిపూడి వినూత్నంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ఇందులో నటించే అవకాశం ఇప్పిస్తామంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో అవన్నీ ఫేక్ అంటూ నిర్మాణ సంస్థ స్క్రీన్స్ తెలిపింది. మా సినిమా పేరుతో ఒక నకిలీ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ కాస్టింగ్ కాల్‌కు, మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు. మా సినిమా తరఫున కాస్టింగ్ పేరుతో సంప్రదిస్తున్న వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పత్రాలు లేదా డబ్బు ఇవ్వవద్దని విజ్ఞప్తి. మా చిత్రానికి సంబంధించిన ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే, అవి కేవలం మా అధికారిక, ధ్రువీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రకటిస్తాం. జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించారు.
#AnilRavipudi #Venkatesh #KalyanRam #KeerthySuresh #KrithiShetty #Tollywood #TeluguCinema #CastingCallFraud #FakeCastingCall #MovieScamAlert #CastingScam #FilmIndustryNews #TollywoodNews #MovieUpdate #CastingFraud #FakeAuditions #SocialMediaScam #MovieCasting #CinemaNews #EntertainmentNews #RayalaseemaBackdrop #FilmProduction #ActorOpportunity #ScamAlert #MovieBuzz











