మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘విశ్వంభర’ విడుదలకు ఇప్పుడు కదలిక మొదలైంది. దర్శకుడు వశిష్ఠతో కలిసి చిరంజీవి ఈ చిత్రంపై ఎంతో నమ్మకంతో ఉన్నా.. రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొంతకాలంగా అంచనాలు నెమ్మదించాయి. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఖరారైనట్టు తెలుస్తుండటంతో థియేట్రికల్ విడుదలకు మార్గం సుగమమైనట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. స్ట్రీమింగ్ హక్కుల కోసం సోనీ లివ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో పోటీలో నిలిచినా.. చివరకు ప్రైమ్ వీడియో ‘విశ్వంభర’ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు అందరి చూపు విడుదల తేదీపైనే ఉంది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘విశ్వంభర’ను తీసుకురావాలన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అదే సమయంలో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెడతామని మేకర్స్ ప్రతి అప్డేట్లో స్పష్టం చేస్తున్నారు. దీంతో రెండు భారీ చిత్రాల విడుదలపై ఆసక్తికరమైన పోటీ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ ‘విశ్వంభర’ ముందుగా వస్తుందా? ‘కాకా’ బరిలో నిలుస్తుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది.
#Vishwambhara #VishwambharaMovie #Chiranjeevi #MegastarChiranjeevi #VishwambharaOTT #VishwambharaOTTDeal #AmazonPrimeVideo #PrimeVideo #VishwambharaReleaseDate #VishwambharaSankranti #Sankranti2027 #Vassishta #ChiranjeeviVassishta #SonyLIV #Tollywood #TeluguCinema #TeluguMovies #SankrantiRace #OTTRelease #MovieNews











