రూ.9 లక్షల బంగారం, నగదు అప్పగించి నిజాయితీ చాటుకున్న ఆటోవాలా

30

చీరాల, జూన్ 24(నాదేశం) : లక్షల విలువైన సొత్తు దొరికినా ఆశకు పోకుండా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. దాసరి పద్మావతి అనే మహిళ తన భర్తతో కలిసి బుధవారం చీరాల కొత్తపేట నుండి ఆటోలో బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆటో దిగే హడావుడిలో రూ.9 లక్షల విలువైన 8 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.7,000 నగదు ఉన్న బ్యాగ్‌ను సీటుపైనే మరిచిపోయారు.

బాధితులు ఆందోళనతో చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండగానే.. సదరు ఆటో డ్రైవర్ మొగిలి శాంతకుమార్ ఆ బ్యాగ్‌ను భద్రంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు దిగిన తర్వాత బ్యాగ్‌ను గమనించానని, బస్టాండ్‌లో వెతికినా వారు కనిపించకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చానని డ్రైవర్ తెలిపారు. వన్‌టౌన్ ఎస్‌ఐ తులసి శ్రీనివాసరావు చేతుల మీదుగా సొత్తును భద్రంగా బాధితులకు అందజేశారు. ఆటో డ్రైవర్ శాంతకుమార్ నిజాయితీని ప్రత్యేకంగా అభినందించారు.

 

#Chirala #HonestAutoDriver #GoodNews #HonestyMatters #AutoDriver #PrakasamDistrict #GoldJewellery #LostAndFound #Humanity #InspiringStory #ChiralaPolice #OneTownPolice #SocialResponsibility #RealHero #PositiveNews #AndhraPradeshNews #DasariPadmavathi #Shanthakumar #Integrity #ViralNews