`బాలకృష్ణ` కొరటాల కాంబో 25న షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం

56

బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ’ఎన్‌బికె 112’గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఆ వివరాలను చిత్రబృందం పంచుకుంది. జూన్ 25న వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ హాజరు కానున్నారు. మే నెలలో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది‘ అనే పవర్‌ఫుల్ కొటేషన్‌తో టీమ్ దీనిపై అంచనాలు పెంచేసింది. కొరటాల శివ మార్కు సామాజిక సందేశంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ’వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ ` గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. మంచు మనోజ్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలను బాలకృష్ణ ఒకేసారి పూర్తి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

#NBK112 #NandamuriBalakrishna #Balakrishna #KoratalaSiva #NBKMovie #Tollywood #TeluguCinema #MovieLaunch #Venkatapalem #NaraLokesh #KandulaDurgesh #BalayyaBabu #MassActionEntertainer #TollywoodNews #MovieUpdate #FilmLaunch #KajalAggarwal #ManchuManoj #GopichandMalineni #TeluguMovies