15 రోజుల పాటు కారంచేడు రైల్వే గేటు మూసివేత

71

చీరాల, జూన్ 22(నాదేశం): చీరాల పరిసర ప్రాంతాల వాహనదారులకు మరియు ప్రయాణికులకు ఒక ముఖ్యమైన గమనిక. చీరాల లోని కారంచేడు రైల్వే గేటును నేటి నుండి తాత్కాలికంగా మూసివేయనున్నారు. రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఈ నెల 23వ తేదీ మంగళవారం నుండి జూలై 7వ తేదీ వరకు దాదాపు 15 రోజుల పాటు కారంచేడు వైపు వెళ్ళే రైల్వే గేటు పూర్తిగా మూసివేయబడుతుంది. ట్రాక్ భద్రత, ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేసేందుకే గేటు మూసి వేస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ 15 రోజులు కారంచేడు మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

 

#Chirala #KaramcheduRailwayGate #RailwayGateClosure #RailwayNews #ChiralaNews #Karamchedu #BapatlaDistrict #TrafficAlert #TravelUpdate #RailwayTrackRepair #RoadDiversion #PublicNotice #AndhraPradeshNews #LocalNews #RailwayDepartment #TrafficAdvisory #CommutersAlert #VehicleDiversion #InfrastructureWorks #RailwayMaintenance #ChiralaTraffic #TravelAdvisory #RoadClosure #PublicInformation #NaDesam