ఎన్నికల ప్రక్రియపై క్లారిటీ ఇవ్వండి.
సీఈసీకి, ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాసింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ కోరింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కుల, సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్, ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై విచారణ జరిపి, అభ్యర్థులకు సకాలంలో పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వార్డుల పునర్విభజనలో లోపాలను సరిచేసిన తర్వాతే తుది ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను మోహరించి, అధికార యంత్రాంగం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యి తుది జాబితాలు వెలువడిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది. రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్, నామినేషన్లు, ఓట్ల లెక్కింపు, మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికలపై అఖిలపక్ష సమావేశంలో స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని కోరింది.
#APLocalBodyElections #YSRCP #LellaAppiReddy #AndhraPradesh #StateElectionCommission #APSEC #LocalElections #AllPartyMeeting #ElectionNotification #WardDelimitation #VoterLists #SIR #APPolitics #MunicipalElections #PanchayatElections











