అందరికీ ఆదర్శంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

115

చీరాల, జూన్ 22(నాదేశం) : సమాజంలో మార్పు రావాలంటే అది మనతోనే మొదలు కావాలని నిరూపిస్తున్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య రహిత సమాజం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఎలక్ట్రిక్ వాహనం పై తన కార్యాలయానికి చేరుకున్నారు. కేవలం పర్యావరణం మాత్రమే కాకుండా, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ఆయన హెల్మెట్ సైతం ధరించి సురక్షిత ప్రయాణంపై అందరికీ అవగాహన కల్పించారు.

ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణతో పాటు, ఇంధన పొదుపును లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. ఒక ప్రత్యేక సందేశంతో.. పెద్ద పెద్ద కాన్వాయ్‌లు, ప్రభుత్వ వాహనాలను పక్కన పెట్టి..పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బైక్‌పై కార్యాలయానికి వచ్చి కలెక్టర్ వినోద్ కుమార్ ఎంతో మంది కి స్ఫూర్తి గా నిలువటం పై జిల్లా ప్రజల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

#Bapatla #BapatlaCollector #VinodKumar #ElectricVehicle #EVBike #GreenInitiative #EnvironmentalProtection #GoGreen #EcoFriendly #SustainableLiving #RoadSafety #HelmetAwareness #PollutionFree #CleanEnvironment #ElectricMobility #PublicAwareness #AndhraPradesh #ChiralaNews #BapatlaNews #DistrictCollector #EnergyConservation #EVAwareness #ClimateAction #Inspiration #PublicService #NaDesam