Home General అగ్రకులాల అహంకారం బిసి పై పైశాచిక దాడి

అగ్రకులాల అహంకారం బిసి పై పైశాచిక దాడి

36

నాడు సీఎం పర్యటించి బీసీలను ఆదుకుంటామన్న గ్రామంలోనే దారుణం..

పెద్దగంజాం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అగ్రకులాల అహంకారంతో బీసీ సామాజికవర్గానికి చెందిన యువకులపై దాడి తెగబడ్డారు. గతంలో ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి, వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘పి4’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇదే చిల్లరగొల్లపాలెం గ్రామంలో.. నేడు బీసీలపై కమ్మ సామాజికవర్గం దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపుతోంది. దాడిలో గాయపడిన బాధితులను వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పరామర్శించారు. గ్రామానికి చెందిన అనిల్, మధు అనే ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు తమ గొర్రెలను మేపేందుకు పొలం వైపుగా తోలుకెళ్తుండగా చూసి ఓర్వలేక, అదే గ్రామానికి చెందిన కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగారు. గొర్రెలు ఇటువైపుగా ఎలా తెస్తారంటూ అసభ్యకర పదజాలంతో దూషిస్తూ, కర్రలతో పైశాచికంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆ ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కూటమి ప్రభుత్వ అధికార అండతోనే అగ్రకులాలు ఇలా రెచ్చిపోతున్నాయంటూ వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బీసీలపై అగ్రకులాల దాడులు, వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయి అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హెచ్చరించారు.

 

#YSRCP #BCs #BCCommunity #RameshYadav #MLCRameshYadav #Peddaganjam #Chillaragollapalem #YadavaCommunity #BCRights #SocialJustice #AndhraPolitics #APPolitics #PoliticalNews #BCCell #YSRCPBCCell #CommunityAttack #CasteDiscrimination #JusticeForBCs #PublicProtest #CoalitionGovernment #AndhraNews #BreakingNews #LatestNews #VillageConflict #PoliticalControversy #BCWelfare #YSJagan #BapatlaDistrict #SocialEquality #NewsUpdate