Home AP పేకాట రాయుళ్ల ఆటకట్టు..రూ.1.82 లక్షల నగదు స్వాధీనం

పేకాట రాయుళ్ల ఆటకట్టు..రూ.1.82 లక్షల నగదు స్వాధీనం

11

కటారివారిపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరం. పోలీసుల దాడి లో పట్టుబడ్డ 14 మంది పేకాట రాయుళ్లు

బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక పెద్ద పేకాట తావుపై పోలీసులు మెరుపు దాడి చేసి జూదరుల ఆట కట్టించారు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కటారివారిపాలెం గ్రామంలో గురువారం జరిగిన ఈ దాడిలో మొత్తం 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి రూ.1,82,560/- నగదును స్వాధీనం చేసుకున్నారు. కటారివారిపాలెం గ్రామంలోని ఒక నివాస గృహంలో కొందరు వ్యక్తులు చేరి పెద్ద ఎత్తున డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఎస్సై జనార్దన్ తన సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి చేశారు. పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేసిన జూదరులను చుట్టుముట్టి, పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ వేటపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించి, నగదును సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన వేటపాలెం ఎస్సై జనార్ధన్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు, మట్కా వంటి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేంది లేదని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు.జూదం లాంటి వ్యసనాలు ఎన్నో మధ్యతరగతి, పేద కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేసి రోడ్డున పడేస్తున్నాయని ఆయన అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్పీ కోరారు.

#BapatlaPolice #Vetapalem #Katarivaripalem #GamblingRaid #CardGameRaid #PoliceRaid #AndhraPradeshPolice #CrimeNews #BapatlaNews #VetapalemPolice #IllegalGambling #Pekata #AndhraNews #BreakingNews #LawAndOrder #SPUmamaheswar #PoliceAction #CrimeUpdate #CashSeized #RaidOperation #APPolice #LocalNews #SocialAwareness #AntiGamblingDrive #CrimeControl #PublicSafety #LatestNews #GamblingCase #PoliceDepartment #AndhraPradesh