Home AP సీఎం ఎదుట సైలెంట్.. కార్యకర్తల ముందు వైలెంట్..

సీఎం ఎదుట సైలెంట్.. కార్యకర్తల ముందు వైలెంట్..

అంతు చిక్కని ఆవేశం.. పవన్ పరకాయ ప్రవేశం.

కార్యకర్తల ముందు ఆవేశం.. ప్రత్యర్థులపై సవాళ్లు.. పార్టీ బలోపేతంపై దూకుడు.. కానీ పాలనలో కీలకమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ స్వరం ఎందుకు నెమ్మదిస్తోంది? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. డీఎస్సీ వివాదం.. స్థానిక ఎన్నికల కమిటీల పునర్వ్యవస్థీకరణ.. కూటమిలో సీట్ల సర్దుబాటు… ప్రతి అంశం జనసేన రాజకీయ భవిష్యత్తుతో ముడిపడుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీపై ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న వేళ పవన్ నుంచి మరింత స్పష్టమైన స్వరం ఎందుకు వినిపించలేదు? యువత ఉద్యోగాలపై రాజకీయ దుమారం రేగుతున్నప్పుడు ఆయన ఎందుకు దూరంగా ఉన్నట్లు కనిపించారు? ఇదంతా కూటమి ధర్మమా? శాఖల పరిమితులా? లేక జాగ్రత్తగా రచిస్తున్న రాజకీయ వ్యూహమా? ఒకవైపు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదన్న బాధ్యత.. మరోవైపు జనసేన క్యాడర్ ఆశలు, పార్టీ స్వతంత్ర రాజకీయ గుర్తింపు. ఈ రెండు మధ్య పవన్ ఎంచుకున్న మౌనం ఇప్పుడు కొత్త ప్రశ్నలను రేపుతోంది. స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ ప్రశ్న మరింత పదునెక్కుతోంది. పవన్ మౌనం కూటమిని కాపాడే వ్యూహమా.. లేక జనసేన స్వరాన్ని మెల్లగా తగ్గిస్తున్న సంకేతమా?

 

#PawanKalyan #JanaSena #JanaSenaParty #APPolitics #AndhraPradeshPolitics #BCReservations #BCQuota #LocalBodyElections #APLocalElections #TDPJanaSenaAlliance #APDSC #PoliticalStrategy #JanaSenaCadre #AndhraPradesh #PoliticalAnalysis