Home AP 23 పట్టణ స్థానాలకు కూమటి అభ్యర్థులు ఖరారు

23 పట్టణ స్థానాలకు కూమటి అభ్యర్థులు ఖరారు

పంచాయతీ ఎన్నికల్లోనూ కలసి పోటీ: మాధవ్ .

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిగానే ముందుకు సాగుతామని భాజపా ఏపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి కూటమికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు ద్వారా దాదాపు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 26న జరగనున్న రెండో దశలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ రాజమండ్రి మేయర్‌, రెండు మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేనకు రెండు కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలు, బీజేపీకి ఒక కార్పొరేషన్‌, రెండు ఛైర్మన్‌ స్థానాలు కేటాయించగా, మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

 

#PVNMadhav #AndhraPradesh #BJP #TDP #JanaSena #NDAAlliance #LocalBodyElections #PanchayatElections #MunicipalElections #Rajahmundry