Home General కలికాలం మహిమ – దేవుడికే సుపారీ ఇచ్చిన కోడలు!

కలికాలం మహిమ – దేవుడికే సుపారీ ఇచ్చిన కోడలు!

54

ఇరవై రూపాయల నోటు.. అత్త ప్రాణానికి రేటు!

సాధారణంగా దేవుడి హుండీలో భక్తులు ఏం కోరుకుంటారు? ఆయురారోగ్యాలు ప్రసాదించమనో, ఐశ్వర్యం ఇవ్వమనో లేదా అప్పులు తీర్చమనో వేడుకుంటారు. కానీ, అనంతపురం జిల్లా పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ఒక వింత “బిజినెస్ డీల్” వెలుగులోకి వచ్చింది. గురువారం ఆలయ హుండీ లెక్కిస్తుండగా అధికారులకు ఒక ఇరవై రూపాయల నోటు దొరికింది. దానిపై ఉన్న మేటర్ చూసి పాపం లెక్కింపు సిబ్బంది గుండె జారినంత పనైంది. “స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు” అంటూ ఒక బాధితురాలు ఏకంగా దేవుడికే అర్జీ పెట్టుకుంది.

అత్తాకోడళ్ల పోరు.. సోషల్ మీడియాలో జోరు!
ఈ కాలంలో అత్తలను భరించడం ఎంత కష్టమైపోయిందో కానీ, సదరు కోడలు గారు చివరికి మనుషులను నమ్మడం మానేసి డైరెక్ట్ గా ఆ దేవుడికే సుపారీ ఇచ్చేసింది. అదీ కేవలం ఇరవై రూపాయలకే! ఈ వింత కోరిక చూసి భక్తులు ముక్కున వేలేసుకుంటుంటే, సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ వర్షం కురుస్తోంది. “ఇరవై రూపాయలకే అత్త ప్రాణం తీయమంటే ఎలా తల్లీ.. జీఎస్టీ కూడా కలపలేదు” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా, ఆ కోడలి మానసిక ఆవేదన ఏ స్థాయికి చేరితే ఇలా దేవుడి హుండీని వాడుకుంటుందని కొందరు జాలిపడుతుంటే, మరికొందరైతే తమ ఇంట్లో కోడళ్లు హుండీల్లో ఏమైనా నోట్లు వేస్తున్నారేమోనని అత్తలు జాగ్రత్త పడటం మొదలుపెట్టారు!

 

#Anantapur #Pampanur #SubrahmanyeswaraSwamyTemple #TempleHundi #FunnyNews #ViralNews #StrangeRequest #TwentyRupeeNote #MotherInLaw #DaughterInLaw #FamilyDrama #ViralStory #SocialMediaBuzz #TeluguNews #AndhraNews #HumorNews #TrendingNews #WeirdNews #TempleNews #HundiCounting #NetizensReaction #ComedyNews #AnantapurNews #ViralPost #FunnyIncident #BreakingNews #LocalNews #SocialMediaTrending #SatiricalNews #UniqueStory