Home AP బెంగళూరులో టైమ్ వేస్ట్ చేసుకోవద్దు – ఏపీకి వస్తే అండగా ఉంటానన్న యువేనేత

బెంగళూరులో టైమ్ వేస్ట్ చేసుకోవద్దు – ఏపీకి వస్తే అండగా ఉంటానన్న యువేనేత

5

బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సంస్థ వ్యవస్థాపకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని స్పేస్-టెక్ స్టార్టప్ ‘పిక్సెల్’ వ్యవస్థాపకుడు క్షితిజ్ ఖండేల్వాల్ నగర శివార్లలో ఉపగ్రహాల తయారీ కర్మాగారం కోసం భూమిని సంపాదించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాటిలైట్లను తయారు చేయడం కంటే బెంగళూరులో భూమిని సంపాదించడం చాలా కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ స్పందిస్తూ తమ కార్యాలయం సంప్రదిస్తుందని చెప్పారు.

ఏపీకి రమ్మని లోకేశ్ ఆహ్వానం
ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చక్కగా ఉపయోగించుకున్నారు. క్షితిజ్ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి రావాలని ఆయన ఆహ్వానించారు. అనంతపురం బెంగళూరుకు అతి సమీపంలో ఉందని, పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. తాము అక్కడ స్పేస్ సిటీలు, ఏరోస్పేస్ పార్కులు, పారిశ్రామిక వ్యవస్థలను సిద్ధంగా ఉంచామని వివరించారు. భూమి కోసం వెతుక్కుంటూ సమయం వృథా చేయకుండా ఉపగ్రహాల తయారీపై దృష్టి పెట్టవచ్చని పేర్కొన్నారు. ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డును ఆ సంస్థతో మాట్లాడాలని సూచించారు.

అనంతపురం పరిశీలనకు సిద్ధమైన పిక్సెల్
మంత్రి నారా లోకేశ్ పిలుపునకు పిక్సెల్ వ్యవస్థాపకుడు క్షితిజ్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ బోర్డు సభ్యులు ఇప్పటికే తమను సంప్రదించారని ఆయన వెల్లడించారు. అనంతపురం స్పేస్ సిటీని సందర్శించి అక్కడ ఉన్న అవకాశాలను పరిశీలించడానికి తమ బృందం ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పారు. బెంగళూరులోని మౌలిక వసతుల లోపాలను ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడానికి లోకేష్ నిరంతరం ఉపయోగిస్తున్నారు.

గతంలోనూ లోకేశ్ ఇదే వ్యూహం
గతంలో కూడా లోకేష్ ఇలాంటి ప్రయత్నాలు చేశారు. 2025 సెప్టెంబర్‌లో బ్లాక్‌బక్ సీఈఓ రాజేష్ యాబాజీ బెంగళూరులోని రోడ్ల గుంతలు, ట్రాఫిక్ సమస్యల వల్ల కార్యాలయాన్ని మార్చాలనుకున్నప్పుడు లోకేశ్ ఆయనను వైజాగ్ రమ్మని కోరారు. అలాగే బెంగళూరు విమానాశ్రయం సమీపంలో భూసేకరణను కర్ణాటక ప్రభుత్వం నిలిపివేసినప్పుడు కూడా ఏరోస్పేస్ పరిశ్రమలను ఏపీకి ఆహ్వానించారు. బెంగళూరుకు వెలుపల 8,000 ఎకరాల సిద్ధంగా ఉన్న భూమిని ఆఫర్ చేశారు. దీనివల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య అప్పట్లో మాటల యుద్ధం కూడా నడిచింది.

 

#NaraLokesh #AndhraPradesh #Pixel #SpaceTech #StartupIndia #KshitijKhandelwal #Anantapur #SpaceCity #AerospacePark #Investment #IndustrialDevelopment #TechStartup #SatelliteManufacturing #Bengaluru #Karnataka #APInvestments #MakeInIndia #EconomicDevelopment #BusinessNews #IndustryNews #APNews #LokeshForAP #InvestmentOpportunity #AerospaceIndustry #SpaceIndustry #StartupEcosystem #Innovation #Entrepreneurship #IndiaTech #LatestNews