అంగవైకల్యాన్ని లెక్కచేయని వధువు. ప్రేమ గెలిచింది.. కానీ వేధింపులు!

46
  • అంగవైకల్యాన్ని లెక్కచేయని వధువు
  • బంధువుల నుండి ప్రాణహాని
  • కడప ఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట

కడప జిల్లా బ్రహ్మంగారిమఠానికి చెందిన ఒక యువతీ యువకుడు ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించిన తరుణంలో, ఒక బైక్ ప్రమాదంలో యువకుడు తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. దీనితో అమ్మాయి ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. అయినా ఆ యువతి తన ప్రేమను గెలిపించుకోవాలని, పెద్దలను ఎదిరించి ఆ వికలాంగ యువకుడినే వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉండటంతో వారు వేరే రాష్ట్రానికి వెళ్లి సంతోషంగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వారి బంధువులు అక్రమ కేసులు పెడుతూ, సొంత ఊరికి రానివ్వకుండా ఇప్పటికీ తీవ్రంగా వేధిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని బాధితులు కడప జిల్లా ఎస్పీ నచ్కేత్ విశ్వనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు బంధువుల నుండి ప్రాణహాని ఉందని, మీడియా మద్దతు కూడా కావాలని వారు ప్రెస్ క్లబ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

 

#Kadapa #LoveMarriage #TrueLove #DivyangGroom #InspirationalStory #BrahmamgariMatham #KadapaNews #AndhraPradesh #LoveWins #InterferenceByRelatives #PoliceProtection #KadapaSP #HumanInterestStory #CoupleSafety #DisabilityAwareness #FamilyDispute #MarriageAgainstOdds #BreakingNews #TeluguNews #ViralStory