ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపిన భార్య

42

కూతురి నిర్వాకానికి తల్లి ఆత్మహత్య
బెళగావి జిల్లాలో వెలుగుచూసిన ఘోరం

బెళగావి జిల్లా హుక్కేరిలో రెండు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, ప్రియుడితో కలిసి భర్తను చంపిన సుమ అనే మహిళ నిర్వాకం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రిటైర్డ్ జవాన్ అయిన భర్త సందీప్ మంజరగి (46) అనారోగ్యంతో ఉన్నప్పుడు, సుమ ఆమె ప్రియుడు కలిసి సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో సుమ, ఆమె ప్రియుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కూతురు చేసిన ఈ ఘోర పాపానికి, అక్రమ సంబంధం దారుణాలకి సమాజంలో తలెత్తుకోలేక ఆమె తల్లి మహాదేవి (57) తీవ్ర మనోవేదనకు గురైంది. పరువు పోయిందనే బాధతో ఘోడగేరి గ్రామంలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు చేసిన ద్రోహానికి నిండు ప్రాణం బలికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

#Belagavi #KarnatakaCrime #InsuranceMurderCase #BelagaviNews #Hukkeri #FamilyTragedy #SuicideCase #CrimeNews #SandeepManjargi #Mahadevi #ExtramaritalAffair #InsuranceFraud #MurderCase #MotherSuicide #ShockingIncident #PoliceInvestigation #KarnatakaNews #BreakingNews #HumanTragedy #TeluguNews