విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విరాళాలు, దర్శనం టికెట్ల విభాగంలో వరుసగా జరుగుతున్న అవినీతి అక్రమాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే రెండు పెద్ద గోల్‌మాల్ ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ అధికారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు రెండు ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమ్మవారి ఆలయ ఆదాయానికి కొంతమంది సిబ్బందే స్వయంగా గండి కొడుతున్నట్లు రుజువైంది.
గతంలో జరిగిన నకిలీ ఐదు వందల రూపాయల టికెట్ల వ్యవహారంలో నిందితులపై నామమాత్రపు చర్యలే తీసుకోవడం వల్లే ఇలాంటి అక్రమాలు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ తాజా ఉదంతాలపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, అవినీతికి సహకరించిన హోంగార్డ్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నిన్న జరిగిన మరో ఘటనలో ఆలయ అధికారులు ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి పూర్తిగా తొలగించారు.
#KanakaDurgaTemple #Vijayawada #TempleScam #TempleCorruption #DurgammaTemple #DonationScam #DarshanTickets #FakeTickets #AndhraPradesh #VijayawadaNews #PoliceInvestigation #OneTownPolice #FIRRegistered #TempleAdministration #CorruptionCase #HomeGuardSuspended #DevoteesShock #TempleRevenue #BreakingNews #APNews











