మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన.. నారా లోకేశ్ పేరు వింటేనే వైసీపీ కేడర్‌లో వణుకు మొదలవుతోందని వ్యాఖ్యానించారు. లోకేశ్ రాజకీయంగా బలపడుతున్నందుకే వైసీపీ నేతలు అసహనంతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. యువనేతకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ప్రతిపక్ష నేతల భయమే నిదర్శనమని అన్నారు. టీచర్ల సమస్యను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొంటూ, స్వార్థ రాజకీయాల కోసం 16 వేల మంది ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, వైసీపీ చేపడుతున్న దీక్షలు, ఆందోళనలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గతంలో వచ్చిన 11 సీట్లు కూడా దక్కవని జోగేశ్వరరావు జోస్యం చెప్పారు. పెద్దల పట్ల గౌరవం, పారదర్శక పాలన, సాంకేతికతకు ప్రాధాన్యం, యువతను ప్రోత్సహించే దృక్పథం లోకేశ్‍ను ప్రత్యేక నాయకుడిగా నిలబెడుతున్నాయని అన్నారు.
#NaraLokesh #VegullaJogeswaraRao #MandapetaMLA #YSRCP #TDP #AndhraPradeshPolitics #APPolitics #NaraLokeshNews #TDPNews #TeacherRecruitment #MegaDSC #AndhraPradeshTeachers #PoliticalNews #YSRCPCriticism #APElections #LokeshPopularity











