Home Naadesam_Special కాకినాడలో మంత్రి మనోహర్‌తో రమేష్ భేటీ

కాకినాడలో మంత్రి మనోహర్‌తో రమేష్ భేటీ



కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్‌కు విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి మనోహర్‌తో రమేష్ చర్చించారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీ సందర్భంగా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నేతలు సూచించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

 

#NadendlaManohar #ThummalapalliRamesh #Kakinada #Jaggampeta #JanaSenaParty #JSP #AndhraPradeshPolitics #APPolitics #PawanKalyan #JanaSenaNews #KakinadaNews #JaggampetaPolitics #PoliticalMeeting #APDevelopment #JanaSenaWorkers #AndhraPradeshNews