రామచంద్రపురంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 13న 46వ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం తెలిపింది. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు కేవీఆర్ హాస్పిటల్ సమీపంలోని ఉపాధి కార్యాలయంలో మేళా ప్రారంభం కానుంది. 18 నుంచి 27 ఏళ్ల వయసున్న టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చు. శ్రీ సిటీ, చెన్నై, తిరుపతి ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం సుమారు 8 ప్రముఖ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. వోల్టాస్, రాయల్ ఎన్‌ఫీల్డ్, యమహా, విండో ఎంఐఎం, కోల్గేట్, విట్టల్ పేపర్స్, అపోలో టైర్స్, ఎంఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. కంపెనీలను బట్టి పీఎఫ్, ఈఎస్ఐ, భోజనం, వసతి, రవాణా సదుపాయాలు ఉంటాయి. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోవాలని వాసంశెట్టి సత్యం కోరారు. వివరాలకు 7075704852, 7075904852 నంబర్లను సంప్రదించాలి.
#RamachandrapuramJobMela #JobMela2026 #VasamshettySubhash #VasamshettySatyam #JobFairAndhraPradesh #APJobs #EmploymentOpportunities #YouthJobs #JobFairKakinada #SriCityJobs #ChennaiJobs #TirupatiJobs #Voltas #RoyalEnfield #Yamaha #Colgate #ApolloTyres #BTechJobs #DiplomaJobs #ITIJJobs











