Home AP కడప జిల్లాలో మంత్రి లోకేశ్ రెండ్రోజుల పర్యటన

కడప జిల్లాలో మంత్రి లోకేశ్ రెండ్రోజుల పర్యటన

111



రెండు రోజుల పర్యటన

 రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ 14, 15 జూలై తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకుని జమ్మలమడుగు నియోజకవర్గంలోని కరమలవారిపల్లికి వెళ్లి అక్కడే రాత్రి బస చేయనున్నారు.

దాల్మియా ప్లాంట్ విస్తరణకు శంకుస్థాపన

బుధవారం ఉదయం కరమలవారిపల్లి నుంచి బయలుదేరి మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామంలోని దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సమీపంలోని దొరసానిపల్లి ప్రాంతాల్లో రిజర్వ్ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం కడప విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు.