చీరాల, జూన్ 21: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో వాహనాలు మరియు స్వయం ఉపాధి యూనిట్లను ఎమ్మెల్యే మాలకొండయ్య పంపిణీ చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ బాపట్ల జిల్లా విభాగం మరియు డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా 10 ప్రత్యేక మోటార్ వెహికల్స్, 5 ట్రై సైకిల్స్, 5 వీల్ చైర్లను పంపిణీ చేశారు. అలాగే ఉపాధి కల్పనలో భాగంగా డీఆర్డీఏ వెలుగు ద్వారా 3 తోపుడు బండ్లు, 2 కార్లు, మరియు ఒక ఆటోను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాలకొండయ్య చేతుల మీదుగా అందజేశారు. సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ఆదరించడం, వారికి అండగా నిలవడం మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ వారికి ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తే వారు మరింత ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగుతారని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. స్వయం ఉపాధి వాహనాలను అందుకున్న లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు.
#Chirala #MLAMalakondayya #DivyangulaKshemam #DisabilityWelfare #Empowerment #SelfEmployment #DRDAVelugu #APDisabilityWelfare #SpecialVehicles #TricycleDistribution #WheelchairDistribution #LivelihoodSupport #InclusiveDevelopment #WelfarePrograms #AndhraPradesh #BapatlaDistrict #ChiralaNews #GovernmentSchemes #SocialWelfare #DifferentlyAbled #SelfReliance #EmploymentGeneration #CommunitySupport #CoalitionGovernment #PublicService #APNews #BreakingNews #LatestNews #BeneficiarySupport #SocialEmpowerment











