చీరాల, జూన్ 21(నాదేశం) : చీరాల పట్టణంలో ఆదివారం జరిగిన ‘నీట్’ వైద్య విద్య ప్రవేశ పరీక్షల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత సేవా శిబిరాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఎన్.ఆర్ & పి.ఎం హైస్కూల్ మరియు ప్రభుత్వ మహిళా కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారి కొరకు కుర్చీలు ఏర్పాటు చేసి, ఎండ తీవ్రత దృష్ట్యా చల్లని త్రాగునీరు, మజ్జిగ, మరియు బిస్కెట్లను పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న చీరాల ఆర్డీవో నరసింగరావు, తహసీల్దార్ గోపికృష్ణ ల చేతుల మీదుగా విద్యార్థుల తల్లిదండ్రులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్షకు వచ్చే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇటువంటి సేవలు అందించడం ఎంతో అభినందనీయమని, రెడ్ క్రాస్ సంస్థ ఎల్లప్పుడూ సేవా పథంలో ముందుంటుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పసుపుల వందనం, త్రోవగుంట అబ్దుల్, కార్యవర్గ సభ్యులు సూరంపల్లి పవన్ కుమార్, శ్రీమతి శివపార్వతి, సుమలత తదితరులు పాల్గొన్నారు.
#NEET2026 #NEETExam #IndianRedCross #RedCrossSociety #Chirala #BapatlaDistrict #StudentSupport #NEETCandidates #CommunityService #SocialService #VolunteerWork #FreeDrinkingWater #ButtermilkDistribution #EducationSupport #ExamDay #StudentWelfare #ParentSupport #NarasingaRao #Gopikrishna #NRPMHighSchool #GovernmentWomensCollege #RedCrossChirala #PublicService #AndhraPradesh #APNews #ChiralaNews #EducationNews #BreakingNews #LatestNews #ServiceToHumanity











