Home General ఉల్లి ధరల మంట.. రైతుకూ కన్నీళ్లు!

ఉల్లి ధరల మంట.. రైతుకూ కన్నీళ్లు!

కిలో రూ.60 దాటింది.. సామాన్యుడికి షాక్.

ఒకప్పుడు కూరలో రుచికి తప్పనిసరిగా వేసే ఉల్లి.. ఇప్పుడు వంటింటి బడ్జెట్‌ను కాల్చేస్తున్న ఖరీదైన వస్తువుగా మారింది. కిలో రూ.60 దాటింది.. కొన్ని చోట్ల రూ.100కు చేరువైంది. మరి ఇదే సమయంలో రైతు పరిస్థితి ఏంటి? పొలంలో పండించిన ఉల్లికి గిట్టుబాటు ధర రాక కన్నీళ్లు పెట్టుకునే రైతు.. మార్కెట్‌కు వచ్చేసరికి అదే ఉల్లి ధర ఎందుకు ఆకాశాన్నంటుతోంది? దేశంలో అవసరానికి మించి ఉల్లి ఉత్పత్తి అవుతోందని లెక్కలు చెబుతున్నా వినియోగదారుడి చేతికి చేరేసరికి ధర ఎందుకు మండిపోతోంది? రైతు తక్కువకు అమ్ముతున్నాడు.. సామాన్యుడు ఎక్కువకు కొంటున్నాడు.. మధ్యలో ఎవరి జేబులు నిండుతున్నాయి? కేంద్రం సబ్సిడీ ఉల్లిని కిలో రూ.35కే విక్రయిస్తున్నా మార్కెట్‌ ధరలు ఎందుకు అదుపులోకి రావడం లేదు? నిల్వలు ఎక్కడ ఆగిపోతున్నాయి? సరఫరా గొలుసులో ఏం జరుగుతోంది? రైతు పండించిన పంటకు సరైన ధర దక్కకుండా, వినియోగదారుడిపై మాత్రం రెట్టింపు భారం పడే ఈ వ్యవస్థకు బాధ్యులు ఎవరు? ఉల్లి ధర పెరిగితే సామాన్యుడి వంటింట్లో మంట.. ధర పడిపోతే రైతు ఇంట్లో కన్నీరు. ఈ ధరల ఆట ఎప్పటివరకు?

 

#OnionPriceHike #OnionPrices #OnionPriceRise #OnionFarmers #OnionMarket #OnionSupply #OnionStorage #OnionProduction #Farmers #ConsumerInflation #FoodInflation #OnionCrisis #OnionSubsidy #KandaExpress #NAFED #NCCF #AgricultureIndia #FarmersCrisis